ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు

ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు

ఇంతదారుణమా?..పట్టపగలే అందరూ చూస్తుండగానే కిరాతకం..షాపులో ఉన్న వ్యక్తిపై కాల్పులు..అడిగిన డబ్బు ఇవ్వకుంటే షాపు ఓనర్ పై ఘాతుకం..ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో శుక్రవారం (మే 18) జరిగిన సంఘటన ఇది..ఉదయం పది గంటలకు సమయంలో బట్టల షాపు ఓనర్ పై ఓ రౌడీషీటర్ దౌర్జన్యం..షాపు సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లంతా మండిపడుతున్నారు.. పట్ట పగలే కిరాతకం అంటున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ బట్టల షాపు ఓనర్ అమీర్ ను కాల్చిచంపేందుకు యత్నించాడు రౌడీ షీటర్ షారూఖ్.నరగంలో పలువురు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తుంటాడు షారూఖ్. ఈక్రమంలో బట్టల దుకాణం నడుపుతున్న అమీర్ ను కూడా డబ్బులు ఇవ్వలాని బెదిరించాడు.. దీనికి అమీర్ ఒప్పుకోకపో వడంతో 21 రోజుల్లో నిన్ను చంపేస్తానని అమీర్ ను బెదిరించాడు. 

చెప్పినట్టుగానే శుక్రవారం షాపులో ఉన్న అమీర్ పై కాల్పుడు జరిపాడు..అమీర్ కాలుకు బుల్లెట్ దిగింది. వెంటనే తేరుకున్న అమీర్..షారూఖ్ పై తిరగబడ్డాడు.. ఈ లోపు చుట్టు పక్కల షాపుల వాళ్లు రావడంతో షారూక్ బైక్ పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను ఆగ్రా పోలీసులు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఘటనపై మండిపడుతున్నారు. పట్టపగలే ఇలాంటి దారుణాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.