గోల్డెన్ టెంపుల్లో సుఖ్ బీర్ సింగ్ బాదల్పై కాల్పులు

 గోల్డెన్  టెంపుల్లో సుఖ్ బీర్ సింగ్ బాదల్పై  కాల్పులు

 పంజాబ్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.   అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం ఎంట్రీ దగ్గర   పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.  

అసలేం  జరిగిందంటే.. సుఖ్ బీర్ సింగ్ బాదల్ అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో శిక్షను అనుభవిస్తున్నారు. . సిక్కుల తాత్కాలిక మతపరమైన సంస్థ అకాల్ తఖ్త్ ఆయనకు పలు మతపరమైన శిక్షలు విధించింది. అందులో భాగంగానే  వీల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌లో గోల్డెన్ టెంపుల్ కు వచ్చిన ఆయన ఎంట్రీ వద్ద మెడలో పలకను ధరించి, చేతిలో ఈటెను పట్టుకుని సేవాదార్  శిక్షను అనుభవిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఇవాళ (డిసెంబర్ 4న ఉదయం) సుఖ్ బీర్ సింగ్  సింగ్ శిక్షలో భాగంగా  సేవాదార్ గా ( సెక్యూరిటీ)  వీల్ ఛైర్ లో  కూర్చొని ఉండగా అతడికి దగ్గరగా వచ్చిన ఓ వృద్ధుడు తన జేబులో నుంచి గన్ తీసి కాల్పులు జరుపుతుండగా..అక్కడే ఉన్న  మరో వ్యక్తి  అడ్డుకోవడంతో గన్ గాల్లో పేలింది.ఈ ఘటనలో సుఖ్ బీర్ కు ప్రమాదం తప్పిపంది.  కాల్పులు జరిపిన వ్యక్తిని అమృత్‌సర్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన నారాయణ్ సింగ్‌గా గుర్తించారు

సుఖ్​బీర్ సింగ్ బాదల్ పై మతపరమైన ఆరోపణలు

శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుఖ్ బీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ బాదల్‌‌‌‌‌‌‌‌ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2007–2017 మధ్య కాలంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా పలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు అకాల్ తఖ్త్ పేర్కొంది.  డేరాసచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌‌‌‌‌‌‌‌కు 2015లో అనుకూలంగా వ్యవహరించారని వెల్లడించింది. సుఖ్‌‌‌‌‌‌‌‌ బీర్‌‌‌‌‌‌‌‌ సింగ్ ను దోషిగా తేల్చింది. దీంతో తాను చేసిన తప్పులను అంగీకరించిన సుఖ్ బీర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు గోల్డెన్ టెంపుల్ లో పాత్రలు శుభ్రం చేయడంతో పాటు బాత్ రూమ్ లు కడగాలని అకాల్ తఖ్త్‌‌‌‌‌‌‌‌ ఆదేశించింది. ఆయన తండ్రి పంజాబ్‌‌‌‌‌‌‌‌ మాజీ సీఎం ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ సింగ్ బాదల్‌‌‌‌‌‌‌‌కు గతంలో ఇచ్చిన బిరుదును  కూడా ఉప సంహరించుకుంటున్నట్టు పేర్కొంది.