
అప్పుడప్పుడు ఇతర దేశాలతో భారతీయుల్ని పోల్చుతూ సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతుంటాయి. మీరూ గమనించే ఉంటారు. ఉదాహరణకు.. అమెరికన్ కంపెనీ ChatGPT కనిపెట్టింది, చైనా కంపెనీ DeepSeek కనిపెట్టింది, మరి ఇండియన్స్ ఏం కనిపెట్టారు..? అని. ఇటువంటి ఆకతాయిలు దేశంలో ఉన్నత కాలం మనకు ఇటువంటి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎంత వెర్రి కాకపోతే గుర్రాన్ని సిగరెట్ తాగమని బలవంతం చేయడమేంటి..! వీరిని ఏమనాలి.
Also Read :- బ్యాంకులు, ఏటీఎంల దగ్గర భద్రత పెంచాలి
ఓ వివాహ విందులో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట ఓ యువకుడు గుర్రాన్ని పడుకోపెట్టి.. దాని నోటిలో సిగరేట్ వెలిగించాడు. అంతటిలో అతడు తన పిచ్చి ప్రయత్నాలు ఆపలేదు. గుర్రంపై కాళ్లు పెట్టి పుష్-అప్‌లు చేశాడు. పక్కనున్న అతిథులు.. ఆ యువకుడి క్రూరత్వాన్ని అడ్డుకోవలసింది పోయి వారూ అతన్నే అనుసరించారు. గుర్రంపై కాళ్లు పెట్టి పుష్-అప్‌లు చేశారు. పైగా ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు వీడియో తీసి.. దాన్ని నెట్టింట పోస్ట్ చేశారు.
వైరలవుతోన్న వీడియోలో గుర్రం నోటిలో సిగరెట్ వెలుగుతూనే ఉంది. గుర్రాన్ని నేలపై పడుకోబెట్టి బలవంతంగా పొగ త్రాగించారు. ఈ చర్యలను జంతు ప్రేమికులు తీవ్రంగా ఖండించారు. పోలీసులను, PETA ఇండియాను ట్యాగ్ చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీన్వాల్ షాబ్
ఈ క్రూరమైన పనికి పాల్పడిన ఇన్‌స్టాగ్రామర్‌ను జీన్వాల్ షాబ్‌గా గుర్తించారు. ఇతడు ఇటీవల పంచుకున్న పోస్టులు హిమాచల్ ప్రదేశ్, సోలన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన చైల్ స్టోన్ టెంపుల్‌లో చూపిస్తున్నాయి. అందువల్ల, జీన్వాల్ ఆ ప్రాంత నివాసి అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవడంతో.. అతడు ఆ రీల్ తొలగించాడు.