చెప్పుకోవడానికి అది చాలా ఖరీదైన వస్తువే.. కానీ దానిపేరు చెప్తే ఛీ అంటారు. దాని విలువ 4.8 మిలియన్లు ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ.50కోట్లు.. ఇంగ్లాండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్ చారిత్మాతకమైన ప్రదేశం. ఎందుకంటే ఇది ఒకప్పుడు బ్రిటన్ గొప్ప లీడర్ విన్‌స్టన్ చర్చిల్ నివాసం. ప్రస్తుతం అది అమూల్యమైన వస్తువులు ఉంచిన మ్యూజియం. 2019 డిసెంబర్ లో ఈ ప్యాలెస్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆ టైంలో 4.8 మిలియన్లు(రూ.50కోట్లు) విలువచేసే బంగారంతో చేసిన టాయిలెట్ బేసిన్ చోరి జరిగింది.
వెల్లింగ్‌బరోకు చెందిన జేమ్స్ షీన్(39) అలియాస్ జిమ్మీ ఈ గోల్డెన్ టాయిలెట్‌ను దొంగలించాడు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్ట్ విచారణలో జిమ్మీ తానే ఆ దొంగతనాన్ని చేసినట్లు ఓప్పుకున్నాడు. ప్రఖ్యాత ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో గోల్డెన్ టాయిలెట్ బేసిన్ తయారుచేశాడు. జిమ్మీ షీన్ అది ఒక్కటే కాదు చాలా విలువైన వస్తువులనే కొట్టేశాడు. నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియంలో విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను చోరీ చేశాడు. అదే నేరంలో ఇప్పుడు 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
గోల్డెన్ టాయిలెట్ బేసిన్ చోరీ కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఇద్దరు వ్యక్తులు జిమ్మీ షీన్ పేరు చెప్పారు. దీంతో ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్ట్ అతన్ని విచారించగా.. తానే ఆ చోరీ చేసినట్లు అంగీకరించాడు. ఇలా టాయిలెట్ బేసిన్ దొంగలించడం జేమ్స్ షీన్ కొత్తేమి కాదు. 2019 షాంఘైలో జరిగిన చైనా ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ ఎక్స్‌పోలో హాంకాంగ్‌కు చెందిన ఓ స్వర్ణకారి వజ్రాలు, బంగారంతో టాయిలెట్ సీటును తయారు చేశాడు. దాంట్లో 40,815 చిన్న వజ్రాలు అమర్చారు. 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఈ మరుగుదొడ్డి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో తయారు చేశాడు. దాన్ని కూడా జేమ్స్ షీన్ చోరీ చేశాడు.