ఏంటీ విచిత్రం : ప్రతి శనివారం ఆ పాము అతన్ని కాటేస్తుంది..

పాములు పగబడతాయా? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. నాగుపాములు మనుషుల్ని గుర్తిపట్టగలవు.. అవి వాటికి హాని తలపెట్టిన వారిని టార్గెట్ చేసి మారీ పగబడతాయని చాలామంది అనుకుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మాత్రం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫతేపూర్ లో 24 ఏళ్ల వికాస్ దూబే అనే వ్యక్తిని ఓ పాము 40 రోజుల్లో 7 సార్లు కాటు వేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే ఆ పాము ప్రతి శనివారం అతన్ని కాటేస్తుంది. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపింక్ గా మారింది. 

ALSO READ | ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

పదేపదే అతన్ని ఎందకు అలా టార్గెట్ చేసిందని ఎవరికీ అర్థం కావట్లేదు. అంతేకాదు పాము కాటు వేసినప్పుడల్లా హాస్పిటల్ కు వెళ్లగానే ఒక్కరోజులోనే వికాస్ దూబే కోలుకుంటున్నాడు. 40 రోజుల నుంచి ఇప్పటి వరకు 7 సార్లు ఆ పాము వికాస్ ను కాటేసింది. జూలై 13 (శనివారం ) కూడా అదే పాము కరిచింది. దీనిపై డాక్టర్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై విచారణ చేయడానికి ముగ్గురు డాక్టర్లతో ఓ టీంను ఏర్పాటు చేసినట్లు  చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి తెలిపారు. అసలు ఏం జరుగుతోందని డాక్టర్లు  ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటపడుతుందని ఆయన మీడియాతో చెప్పారు.