మాకు ఒళ్లు వణుకుతుంది.. : నువ్వేంట్రా అంటే నాగుపాముకు తల స్నానం చేయిస్తున్నావ్..

మాకు ఒళ్లు వణుకుతుంది.. : నువ్వేంట్రా అంటే నాగుపాముకు తల స్నానం చేయిస్తున్నావ్..

పాము.. ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. అల్లంత దూరంలో కనిపిస్తేనే మనం ఇటు నుంచి ఇటు పరిగెడతాం.. ఇక మన దగ్గరకు వచ్చిందని తెలిసినా.. మన కళ్లకు దగ్గరలో కనిపించినా అన్నీ వదిలేసి.. పరిగెడతాం.. అంతెందుకు నడి సముద్రంలో పడవలో పాము కనిపిస్తే.. ఆ భయానికి సముద్రంలోనే దూకేస్తాం.. అంత భయం మనకు పాము అంటే.. అలాంటి పామును ఒకడు బేబీ లెక్క చూసుకుంటున్నాడు.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ వ్యక్తి నిర్భయంగా కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా బాత్రూమ్‌లో పాముకు స్నానం చేస్తూ కనిపించాడు.

“కింగ్ కోబ్రాకు స్నానం.. పాములు వాటిని రక్షించుకోవడానికి & శుభ్రంగా ఉంచుకునే చర్మాన్ని కలిగి ఉంటాయి, అది కాలానుగుణంగా తొలగిపోతుంది. కావున నిప్పుతో ఆడుకోవాల్సిన అవసరం ఏమిటి? అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి, సుశాంత నంద Xలో ఈ వీడియోను పంచుకున్నారు. 19 సెకన్ల ఈ వీడియోలో, ఓ వ్యక్తి బకెట్‌లోని మగ్గుతో పాముపై నీరు పోయడం కనిపిస్తుంది. అతను ఇందులో ఒక పాయింట్ వద్ద కింగ్ కోబ్రా తలని పట్టుకున్నట్లు కూడా కనిపిస్తోంది.

ఈ వీడియో ఇప్పటివరకు 12వేల వ్యూస్ ను సొంతం చేసుకోగా.. నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. . కొంతమంది యూజర్స్ ఈ చర్యను ప్రశ్నిస్తున్నారు, మరికొందరు వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు.

Also Read :- పెట్రోల్ లేదని విమానాలు నిలిపివేసిన పాకిస్తాన్

"బందిఖానాలో (వివేరియంలో పెంపుడు జంతువులు వలె), కొన్నిసార్లు పాములు తమ చర్మాన్ని పూర్తిగా తొలగించుకోలేవు, పాత చర్మంతో కొంత భాగాన్ని అలాగే అంటుకుని ఉంటాయి. దాన్ని పూర్తిగా తొలగించడానికి మనమే శుభ్రం చేయాల్సి ఉంటుంది. కానీ పామును పట్టుకోవడం లేదా స్నానం చేయించడం సరి కాదు” అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.