ముంబైలో 28 ఏళ్ల యువకుడు ప్రియురాలిని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే స్పానర్(పాణ)తో కొట్టి చంపాడు. వాసాయి తూర్పు చించ్‌పాడ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్తి అనే యువతి పనికి వెళ్తుండగా ఆమె మాజీ ప్రియుడు రోహిత్ యాదవ్ హత్య చేశాడు. మాజీ ప్రియురాలిని చంపి.. శవాన్ని ఇందుకిలా చేశావ్ అని అడుగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.
VASAI | वसईत एका तरुणीची तिच्या प्रियकराने सपासप वार करून निर्घृण हत्या केल्याची संतापजनक घटना मंगळवारी सकाळी घडली. हा हल्ला रस्त्याच्या मधोमध झाला, जिथे 29 वर्षीय हल्लेखोराने पीडितेच्या डोक्यावर आणि छातीवर वारंवार वार केले. दोन वर्षांच्या रिलेशनशिपनंतर नुकतेच ब्रेकअप झाल्याचे या… pic.twitter.com/1pRCsPumcr
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) June 18, 2024
ఆర్తి, రోహిత్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈమధ్య వారికి తరుచూ గొడవలు అవుతున్నాయి. ఆర్తి వేరే వ్యక్తితో రిలేషన్ లోకి వెళ్లిందనే అనుమానంతో రోహిత్ ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు ముందు జూన్ 15న ఆర్తి ఫోన్ పగలగొట్టి, ఆమెను కొట్టాడని రోహిత్ పై పోలీస్ స్టేషన్ లో అచోలా పోలీస్ స్టేషన్, నలసోపరాలో కేసు పెట్టింది. ఆర్తి కంప్లెయింట్ తో పోలీసులు రోహిత్ ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కారణంగానే రోహిత్ కోపంతో మంగళవారం ఆర్తి రోడ్డుపై వెళ్తుండగా అడ్డగించి స్పానర్ తో తల, ఛాతిపై బలంగా కొట్టి చంపాడు. అది ఆపడానికి ఓ వ్యక్తి వస్తే.. అతన్నీ కొట్టి చంపుతా అని బెదిరించాడు.