
కాజీపేట/మిల్స్ కాలనీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ బైపాస్ రోడ్డులోని బట్టుపల్లి వద్ద గురువారం రాత్రి దుండగులు కారులో వెళ్తున్న ఓ వ్యక్తిపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు వ్యక్తులు బాధితుడి కారును వెంబడించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న మడికొండ పోలీసులు బాధితుడిని ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. బాధితుడిని కాజీపేటకు చెందిన గాదె సిద్ధార్థ రెడ్డిగా గుర్తించారు.