- కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య
- సూసైడ్ నోట్లో యువతి పేరు
కరీంనగర్ క్రైం, వెలుగు : అమ్మాయి వేధింపులతో ఓ యువకుడు బుధవారం కరీంనగర్ కేబుల్‌బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్లాపూర్ కు చెందిన దూది రాజశేఖర్ రెడ్డి(28) కరీంనగర్ లోని ఓ మెస్‌లో పని చేస్తున్నాడు. అక్కడే పనిచేసే మానకొండూర్ మండలం పచ్చునూర్ కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది.
రాజశేఖర్ కు ఇటీవల పెండ్లి సంబంధం కుదిరింది. అయితే సదరు యువతి తనతో దిగిన ఫొటోలు, మాట్లాడిన ఫోన్ రికార్డులను బయటపెడతానని రాజశేఖర్‌ను బ్లాక్‌మెయిల్ చేసింది. తననుపెండ్లి చేసుకోవాలని లేకపోతే గ్రామంలో పరువు తీస్తానని బెదిరించింది. ఈ నెల 23న అమ్మాయికి సంబంధించిన నలుగురు మల్లాపూర్ గ్రామానికి వెళ్లి రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులతో గొడవకు దిగారు.
దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్‌రెడ్డి సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకొని కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిపై పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి తండ్రి రఘుపతిరెడ్డి
ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.