తాగుదాం అని పిలిచి.. కొట్టి చంపిండ్రు..

హైదరాబాద్ లో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. మద్యం మత్తులో యువకుల మధ్య ఓ యువతి విషయంలో ఏర్పడిన వివాదం హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచోకీలో నివాసం ఉండే విశాల్ సింగ్ గతంలో.. మణికొండలో నివాసం ఉండే యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. శుక్రవారం యువతి సోదరుడు శ్యామ్, విశాల్ సింగ్ కు ఫోన్ చేసిన మణికొండకు రమ్మన్నాడు.

 మణికొండలో విశాల్ సింగ్ తో కలిసి శ్యామ్ అతని స్నేహితులు భయ్యా, అర్జున్, సుమన్, రాజేష్,సోని, అరుణ్ లు మద్యం సేవించారు. మద్యం మత్తులో శ్యామ్ సోదరి విషయం వచ్చింది. దీంతో విశాల్ సింగ్ యువతి గురించి అసభ్యంగా మాట్లాడటంతో శ్యామ్ కు, విశాల్ కు మధ్య ఘర్షణ చెలరేగింది. శ్యామ్ అతని స్నేహితులు విశాల్ సింగ్ మీద కర్రలతో దాడి చేసి అతి క్రూరంగా కొట్టారు. స్థానికులు వెంటనే గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ALSO READ :- ట్రైన్‌లో విండోసీట్ బుక్ చేసుకుంటే సీటు ఉంది కానీ.. విండో లేదు

 సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చే సరికే శ్యామ్ మరియు అతని స్నేహితులు పరారయ్యారు. గాయపడిన విశాల్ సింగ్ ను పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విశాల్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని రాయదుర్గం పోలిసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.