మరీ చిత్రం కాకపోతే ఏంటీ.. తన యూట్యూబ్ ఛానెల్ లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ కోసం.. 4 వేల 600 ఫోన్లు ఉపయోగించాడనే కారణంగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. య్యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే ఛానెల్‌కు సంవత్సరంలో కనీసం 1,000 సబ్ స్రైబర్లు 4,000 కంటే ఎక్కువ వీక్షణ గంటలు ఉన్నప్పుడు YouTube యాడ్స్ తో డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఒక వ్యక్తి తన లైవ్ లో నకిలీ వీక్షకులును పెట్టాడు.
4600 ఫోన్లు కొని నకిలీ వ్యూస్ ను సంపాధించాడు. ఈ నకిలీ వ్యూస్ తో కోట్లు సంపాధించాడు. నకిలీ వ్యూస్ ఏంటీ మేము నకిలీ వస్తువులు చూశాం, చివరకి నకిలీ బియ్యం కూడా చూశాం ఈ నకిలీ వీక్షకులు ఎవరబ్బా అని అనుకుంటున్నారా.. అయితే పూర్తిగా చదవండి
చైనాలో వాంగ్ అనే వ్యక్తి ట్రాఫిక్ కోసం వేలాది ఫోన్‌లను ఉపయోగించి తన వీడియోస్ ను తానే చూసేల చేశాడు ఓ యూట్యూబర్. నాలుగు నెలల్లోపు ఈ వ్యూలను ఉపయోగించి అతను దాదాపు $415,000 (సుమారు రూ. 3.4 కోట్లు) సంపాదించగలిగాడు. వాంగ్ తన యూట్యూబ్ ఛానెల్ వీక్షణ సమయాన్ని పెంచడానికి తన స్ట్రీమ్‌లలో వ్యక్తులను ఎంగేజ్ చేయడానికి దాదాపు 4,600 ఫోన్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాంగ్ 2022లో అతని స్నేహితుడు 'బ్రషింగ్' అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేయడంతో ఈ చట్టవిరుద్ధమైన చర్యను ప్రారంభించాడు. వాంగ్ 4,600 మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేశాడు, వీటిని ప్రత్యేక క్లౌడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నియంత్రించారు. అంతే కాకుండా, అతను వీక్షణను నియంత్రించడానికి ఒక టెక్ కంపెనీ నుండి రూటర్లు, VPN సేవలు, నెట్‌వర్క్ పరికరాలు, స్విచ్‌లను కూడా కొనుగోలు చేశాడు. కేవలం కొన్ని క్లిక్‌లతో, అతను అన్ని మొబైల్ ఫోన్‌లను కలిసి ఆపరేట్ చేయగలిగాడు. అతని ఛానెల్‌లో ట్రాఫిక్ పెంచాడు.
ఈ మొత్తం సంగతి ఇటివలె బయటపడింది. అక్రమ వ్యాపార కార్యకలాపాల నేరంలో పాల్గొన్నందుకు 15 నెలల జైలు శిక్ష 7,000 డాలర్లు (రూ. 84 లక్షలు) జరిమానా విధించింది అక్కడి కోర్టు.