జీడిమెట్ల, వెలుగు: వీసా కోసం కన్సల్టెన్సీకి ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని ఓ వ్యక్తిని పలువురు కిడ్నాప్ చేశారు. సూర్యాపేటకు చెందిన వరప్రసాద్హర్మేనియాలో మెడిసిన్చదవడానికి వీసా కోసం.. నిజాంపేట్‌కు చెందిన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యజమాని శివశంకర్‌రెడ్డికి రూ.4 లక్షలు ఇచ్చాడు. వీసా వచ్చిన తర్వాత తమ కుమారుడు హర్మేనియాకు వెళ్లడని డబ్బులు తిరిగి ఇవ్వాలని వరప్రసాద్ తల్లిదండ్రులు ఎర్రవీరయ్య, ఎర్ర పద్మ డిమాండ్‌చేశారు.
ఇదే విషయమై గురువారం రాత్రి శివ శంకర్ రెడ్డి ఇంటికి పలువురు వెళ్లి కారులో కిడ్నాప్ చేశారు. అడ్డుగా వచ్చిన అతడి భార్య, కూమార్తెను కొట్టి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేశారు. దీంతో శివశంకర్‌రెడ్డి కూమార్తె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగారు. శివశంకర్ రెడ్డిని విడిపించి నిందితులు ఎర్ర వీరయ్య, పోరెండ్ల దశరథ, మందాడి శ్రవణ్ కుమార్, అలుగుబల్లి వెంకట్రామ్రెడ్డి, బోనత్నాగు, ఎర్రపద్మ ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కి తరలించారు.