హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సొంత అన్న, మామను దారుణంగా హత్యచేశాడో వ్యక్తి. ఈ ఘటన సెవెన్ టూంబ్స్ రోడ్లోని నదీం కాలనీలో చోటుచేసుకుంది. ఎండీ లైన్స్ నివాసి అయిన ఇమ్రాన్ పాత కక్షల కారణంగా తన సొంత అన్న, మామను హతమార్చాడు. అనంతరం ఘటనాస్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
For More News..
సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడిని కాలితో తన్నిన సర్పంచ్
ఒక్కో ద్రాక్ష పండు రూ.35,000.. ఎందుకు అంత రేటు?
త్వరలో కరెంటు, ఆర్టీసీ చార్జీల పెంపు?