
వెల్దుర్తి: భార్యను కాపురానికి పంపడం కోపంతో అత్తను అల్లుడు కొట్టి చంపాడు.ఈఘ టన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కలాన్ శెట్టిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన శోభకు మెదక్ పట్టణానికి చెందిన దశరథ్ తో దాదాపు పదేళ్ల కిందట పెళ్లి జరిగింది. కొన్నేళ్ల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుండడంతో కొన్నాల్ల కిందట భర్తను శోభ వదిలి పెట్టి హైదరాబాద్ లోని తన అన్న వద్ద ఉంటోంది. ఇటీవల ఆమె కలాన్ శెట్టిపల్లికి వచ్చింది. విషయం తెలుసుకున్న దశరథ్ నిన్న మద్యం తాగి అత్తారింటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో గొడ్డలితో అత్త కంసమ్మ (52)ను దారుణంగా నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.