
- రూ.3 లక్షలు పోగొట్టుకున్న కూలీ
- గోల్డ్ లోన్ పైసలను మాయం చేసిన కేటుగాడు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒకరు మొబైల్ పోగొట్టుకోగా అది దొరికిన వ్యక్తి అందులో గూగుల్ పే, ఫోన్ పే ఇన్ స్టాల్చేసి రూ.3 లక్షలు కొట్టేశాడు. హైదరాబాద్ కు చెందిన 56 ఏండ్ల వ్యక్తి కూలీ పని చేస్తున్నాడు. ఇతడు 20 రోజుల కింద గోల్డ్ తనఖా పెట్టి రూ.3 లక్షలకు పైగా లోన్ తీసుకున్నాడు. నెల కిందట సిటీ బస్సులో ప్రయాణిస్తుండగా మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు కంప్లయింట్ఇచ్చాడు. 20 రోజుల కింద అకౌంట్ లో డబ్బులు చెక్ చేసుకోవడానికి బ్యాంక్ కు వెళ్లగా లేకపోవడంతో షాక్ తిన్నాడు.
డబ్బులు ఎలా మాయమయ్యామని వివరాలు కనుక్కోగా అతడి యూపీఐ అకౌంట్నుంచి ట్రాన్స్ఫర్చేసినట్టు తేలింది. అయితే, బాధితుడి మొబైల్సంపాదించిన వ్యక్తులు అందులో ఫోన్ పే, గూగుల్ పే ఇన్స్టాల్చేసి అకౌంట్ నుంచి రూ.2 లక్షల 98 వేలు వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకున్నట్టు గుర్తించారు.
అయితే, బాధితుడు మాట్లాడుతూ తన ఫోన్లో ఎప్పుడూ తాను ఫోన్‌పే, గూగుల్‌పే డౌన్లోడ్చేయలేదని, కూలీ పని చేసుకునే తన దగ్గర డబ్బులు కొట్టేయడం న్యాయం కాదని బోరున విలపించాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.