రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్ గూడ చౌరస్తా వద్ద ఒ లారీ పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను ఢి లారీ కొట్టింది. లారీ చక్రాల కింద భర్త నలిగిపోగా.. లారీ కిందపడి గాయపడిన మహిళ బయటకు తీశారు. వెంటనే స్థానికులు 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా.. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడంతో లారీ పాదచారుల పైకి దూసుకొని వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో భార్య కళ్ల ముందే భర్త కొట్టు మిట్టులాడుతూ ప్రాణాలు విడిచాడు. భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజులగా గుర్తించారు. ఈ దంపతులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు బతుకుదేరువు కోసం వచ్చారని తెలుస్తోంది . లారీ రూపంలో ప్రమాదం దూసుకొచ్చి వారి జీవితాలను చిధ్రం చేసింది.ఈ రోడ్డు ప్రమాదంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.