అక్కా చెల్లెళ్లు ఇద్దరినీ ఒకే మండపం మీద పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో వధువులిద్దరి మెడలో పూలదండలు వేశాడు. మధ్యప్రదేశ్ లోని గుడావలి లో జరిగిందీ వివాహా వేడుక.
గుడావలికి చెందిన 35 ఏళ్ల దిలీప్ అలియాస్ దీపు పరిహార్ (35)కు తొమ్మిదేళ్ల క్రితమే వినీత(28)తో పెళ్లి అయింది. వారికి ముగ్గురు సంతానం కూడా. వినీత ఆ గ్రామానికి సర్పంచ్. వినీత ఆరోగ్యం ఈ మధ్య బాగాలేకపోవడం వల్ల తన చెల్లెలు(కజిన్) రచనను పెళ్లి చేసుకోవాల్సిందిగా భర్తను కోరింది. ఆరోగ్యం పాడైతే పిల్లలకు చూసుకోవడానికి ఇంట్లో తన స్థానంలో ఇల్లాలిగా చెల్లెలే ఉండాలని దిలీప్ కు తెలిపింది. దిలీప్ కూడా 22 ఏళ్ల రచనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.
అయితే భార్య మీద ఉన్న అపార ప్రేమతో.. రచనతోపాటు వినీతను కూడా మరోసారి అదే వేదిక మీద తాజాగా పెళ్లి చేసుకున్నాడు దిలీప్. “నేను వినీత అంగీకారంతోనే రచనని వివాహం చేసుకున్నాను. ఆమె అనారోగ్యంతో ఉండడం వల్ల.. పిల్లల బాగు కోసం మరో పెళ్లి చేసుకున్నానని” దిలీప్ తెలిపాడు.
హిందూ వివాహ చట్టం ప్రకారం, భార్య ఉండగానే మరో స్త్రీ ని పెళ్లాడటం నేరం. అయితే, ఈ ఘటన కి సంబంధించి తమకు ఇంకా ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని భింద్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రుడాల్ఫ్ అల్వారెస్ అన్నారు.
Husband of sarpanch Marries her cousin in Madhya Pradesh !
A man from Gudavli of Madhya Pradesh Married Rachna Devi who is a Cousin of his 1st wife Vineeta Devi. Vineeta Devi is the Sarpanch of Gaudavli Village.
Posted by News Today Channel on Sunday, December 8, 2019