పాపం..నిద్రిస్తున్న ఉన్న కుక్కను దారుణంగా కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు.. లావుపాటి కర్రతో తలపై కొట్టడంతో గిలగిలా కొట్టుకుంది. రెండు నిమిషాలపాటు నరకం చూసింది.చివరికి ప్రాణాలొదిలింది ఆ మూగజీవి. తల్లి మరణించిందని తెలియక పాలు తాగేందుకు దాని పిల్లలు ప్రయత్నించాయి. పాలు రాకపోవడంతో రోదిం చాయి. కాన్పూర్ లోని శ్యామ్ నరగ్ లో జరిగిన ఈ దారుణమైన చర్య చూసేవారికి కలచివేసింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలోకి వెళితే..
एक बार फिर एक स्वान को जान से मार डाला , कृपया जल्द से जल्द करवाही करे ।
— the faithful Hands (@faithful_hands0) March 12, 2024
Location:- shyam nagar, kanpur@112UttarPradesh @bstvlive @kanpurnagarpol @nagarnigamknp @aajtak @pfaindia @PetaIndia pic.twitter.com/Pps5gVrT4B
ఓ దుర్మార్గుడు నిద్రిస్తున్న కుక్కను మందపాటి కర్రతో కొట్టి చంపాడు.. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుక్కకు పిల్లలు ఉన్నాయి. అవి పాలు తాగేందుకు చనిపోయిన తల్లి డెడ్ బాడీ వద్ద రోదించాయి. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్న విదిత్ శర్మ ఈ సీసీ ఫుటేజ్ ని Xలో షేర్ చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అధికారులు కోరారు.. నెటిజన్లు కూడా ఈ దారుణమైన చర్యపై మండిపడ్డారు.
సీసీ ఫుటేజీలో కుక్క ను చంపిన తీరు చూస్తూ చాలా దారుణంగా ఉంది. నిద్రిస్తున్న కుక్కను లావు పాటి కర్రతో తలపై కొట్టడంతో గిలగిలా కొట్టుకొని నరకం అనుభవించి చనిపోయింది ఆ కుక్క. చనిపోయిన తల్లి చనురొమ్ములను చీకుతూ పాలు రాకపోవడం కుక్క పిల్లలు రోదిస్తున్న దృశ్యాలు చూసినవారందరికి కన్నీళ్లు తెప్పించాయి. నిందితుడి దారుణ చర్యకు చూసిన వారు విస్మయం చెందారు. ఇది చాలా క్రూరత్వం.. నోరు లేని జంతువులను పట్టించుకోక పోయిన పర్వాలేదు గానీ ఇలా దయలేకుండా చంపడం దారుణం అని ఇలాంటోళ్లను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడు తున్నారు.
#नशेबाज पति ने डंडे से अपने पत्नी को मारा, फिर उसी डंडे से बेजुबान जानवर को मौत के घाट उतारा, ऐसे दरिंदों को मौत की सजा होनी चाहिए, पुलिस ने 429 मे एफआईआर दर्ज कर ली है,@adgzonekanpur @kanpurnagarpol @myogiadityanath @narendramodi@DMKanpur ,## pic.twitter.com/3TqWRPg0or
— DIVAKAR PATHAK REPORTER 🖋️ (@DIVAKAR94154021) March 12, 2024