నా చావుకు హసన్‌పర్తి పోలీసులే కారణం.. సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం

వరంగల్: జిల్లాలోని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మిస్సింగ్ కలకలం రేపుతోంది. పోలీసుల దెబ్బలు బరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు ప్రశాంత్ అనే వ్యక్తి. దీంతో తన భర్తను కాపాడి, హసన్ పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి బాధితుడి భార్య శ్యామల ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. తమ దగ్గర డబ్బులు  అప్పుగా తీసుకున్నవారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే తన భర్త ప్రశాంత్ ను విచక్షణారహితంగా కొట్టారని శ్యామల తెలిపింది. 

పోలీసుల టార్చర్ భరించేక ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన చావుకు హసన్ పర్తి  సీఐ, ఎస్ఐ కారణమని సూసైడ్ నోట్ రాసి  బాధితుడు ప్రశాంత్ కనిపించకుండా పోయాడు.  దీంతో బాధితుడి భార్య ఫిర్యాదుతో సీపీ రంగంలోకి దిగారు.  ఈ ఘటనపై సీపీ ఆదేశాలతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన  పోలీసులు.. బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.