హైదరాబాద్ లో మిస్సైన యువకుడు ఇబ్రహీంపట్నం చెరువులో శవమై తేలాడు..

రంగారెడ్ది జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ( జనవరి 19, 2025 ) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..   ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్ గూడ కు చెందిన మహేష్ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. మహేష్ కనిపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు శనివారం ( జనవరి 18, 2025 ) హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మహేష్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఇబ్రహీంపట్నంలోని పెద్దచెరువులో అతని మృతదేహం లభించింది. చెరువు దగ్గర మహేష్ బైక్, హెల్మెట్, బ్యాగ్ లభించటంతో మహేష్ మృత దేహం కోసం చెరువు లొ గాలింపు చర్యలు చేపట్టారు మునిసిపల్ సిబ్బంది. 

Also Read :- మేనకోడలినే బ్లాక్ మెయిల్ చేసిన నీచుడు

సంఘటనా స్థలానికి చేరుకున్న ఇబ్రహీం పట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మహేష్ మృతితో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.