నల్గొండ జిల్లా చిట్యాలలో వ్యక్తి హత్య

నల్గొండ జిల్లా చిట్యాలలో వ్యక్తి హత్య

నల్లగొండ జిల్లా : చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రైల్వే స్టేషన్ రోడ్ లో వ్యక్తి హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్( 50) జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గా గుర్తించారు పోలీసులు. 

ఎక్కడో హత్య చేసి చిట్యాల రోడ్ కు పక్కన పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.