జేసీబీ లోన్ కోసం సొంత బావను హత్య చేసిన బామ్మర్ది

జేసీబీ లోన్  కోసం సొంత బావను హత్య చేసిన బామ్మర్ది

సంగారెడ్డి అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.   సొంత బావనే హత్య చేశాడు ఓ బామ్మర్ది.  అమీన్ పూర్ లో నివాసముంటున్న బాణోతు గోపాల్ నాయక్ ( 42 ) ను  గొంతు నులిమి హత్య చేశాడు నరేష్. 

మెదక్ జిల్లా పాపన్న పేట్ చెందిన  ఇద్దరు బావబామ్మర్దులు  కలిసి ఇటీవల  జేసీబీ వాహనాన్నికొనుగోలు చేశారు . అయితే బావను హత్య చేస్తే అతని పేరుపై ఉన్న జేసీబీ లోన్ మాఫీ అవుతదని హత్య చేసినట్లుగా  సమాచారం.   సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పటాన్  చెరు ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలించారు.