గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత బామ్మర్దిని సుఫారీ ఇచ్చి హతమార్చిండు భావ. సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. గచ్చిబౌలి ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్న మృతుడి బావ.అదే హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు మృతుడు యశ్వంత్(25). అయితే అప్పుల ఊబిలో చిక్కుకున్న మృతుని బావ ఆస్తి కోసం సూఫారీ ఇచ్చి మరీ సొంత బామ్మర్ది యశ్వంత్ ను హత్య చేయించాడు. ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చిత్రీకరించారు నిందితులు.
అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో మృతదేహాన్ని కననం చేశారు కుటుంబ సభ్యులు. అనుమానం వచ్చిన యశ్వంత్ తండ్రి సెప్టెంబర్ 13న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసుగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ప్రధాన నిందితుడు మృతుని బావను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల విచారణలో ఆస్తి కోసం సొంత బామ్మర్ది యశ్వంత్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. సుఫారీ తీసుకున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.