నా కొడుకునే అరెస్ట్ చేస్తారా: పోలీస్స్టేషన్లో పోలీసులపై కాల్పులు

కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ క్రిమినల్ కేసులో తన కొడుకును పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.శుక్రవారం రాత్రి (నవంబర్ 3) జరిగిన ఘటనలో పోలీసులు ఎవరూ గాయపడలేదు. ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న చిరక్కల్ ప్రాంతానికి చెందిన రోషన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు నిందితుడి ఇంటి వద్ద ఈఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 

తమిళనాడువాసిపై దాడికి సంబంధించిన కేసులో రోషన్ ను వెతుకుతూ  పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రోషన్ తండ్రి థామస్ ఆకస్మాత్తుగా పోలీస్ బృందంపై కాల్పులు జరిపాడు.ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. రోషన్ తండ్రి థామస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోషన్ మాత్రం తప్పించు కున్నారు. రోషన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. థామస్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. 
థామస్ భార్య ఆరోపణ 

ఈ ఘటనపై రోషన్ తల్లి థామస్ భార్య 

ఈ ఘటనపై రోషన్ తల్లి థామస్ భార్య  మరోలా స్పందించారు. కొందరు గూండాలను తీసుకొచ్చి తమ ఇంటిపై  దాడి చేశారని థామస్ భార్య ఆరోపించింది. వారు ఇంటికి వచ్చీ రాగానే దాడి చేశారు. ఇంటిని ధ్వంసం చేశారు. వారు గూండాలు అనుకొని తన భర్త కాల్పులు జరిపాడని థామస్ భార్య తెలిపింది. 

థామస్ భార్య ఆరోపణలను కన్నూర్ పోలీస్ కమిషనర్ తోసిపుచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు  ఎవరినీ వెంట తీసుకెళ్లా్ల్సిన అవసరం లేదన్నారు. పోలీసు బృందంతో ఉన్న వారే తమ ఇంటి పై దాడి చేశారని థామస్ భార్య చేసిన ఆరోపణలను ఖండించారు. 

థామస్ భార్య ఆరోపణలను కన్నూర్ నగర పోలీసు కమిషనర్ అజిత్ కుమార్ తోసిపుచ్చారు మరియు నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు ఎవరినీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

ALSO READ :- ప్రాణం అల్లాడి పొద..హాయ్ నాన్న థర్డ్ సింగిల్ రిలీజ్