
ఏదైనా అనారోగ్యం వస్తే మొదటగా అందరూ వెళ్లేది మెడికల్ షాపునకు.. అలాంటి మెడికల్ షాపులోనే ఉద్యోగి పని చేస్తు్న్న వ్యక్తి.. ఓ కస్టమర్ కు బిల్లింగ్ చేస్తూ.. మెడికల్ షాపులోనే గుండెపోటుతో.. నిట్టనిలువునా కుప్పకూలి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. విజువల్స్ చూస్తే అయ్యో పాపం అనక మానరు.. పూర్తి వివరాల్లోకి వెళితే...
మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని సత్యనారాయణ కాలనీలో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ లో విధులు నిర్వహిస్తున్న మురళీ గుండె పోటుతో మృతి చెందాడు. కస్టమర్లకి బిల్ కొడుతున్న సమయంలో హఠాత్తుగా పడిపోయాడు. తోటి సిబ్బంది పరీక్షించి మురళీ మృతి చెందినట్టు నిర్ధారించారు.
కీసర గ్రామానికి చెందిన మురళీ , వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జీవనం సాగించిన మురళీ మెడ్ ప్లస్ లో ఉద్యోగం రావడంతో టీచింగ్ వదిలేసి మెడికల్ లో పనిచేస్తూ జీవన్ సాగిస్తున్నాడు. మురళీ కింద పడిపోయిన దృశ్యాలు సీసీ టీవి కెమెరాలో రికార్డ్ కావడంతో సిబ్బంది చూసి కన్నీటి పరమయ్యారు.