
ఊహించని సంఘటన.. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మనం సాధారణంగా ఉక్కపోతకు గురైనప్పుడు చల్లని గాలి కోసం కిటికీలు తెరుస్తుంటాం..అప్పడప్పుడు తలను బయటకు పెట్టి చల్లని గాలిని ఆస్వాదిస్తుంటాం.. అయితే ఇది ప్రమాదకరమని మనకు డ్రైవర్ , కండక్టర్ హెచ్చరిస్తుంటారు. ఇదంతా కామన్ గా అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ ఊహించని విధంగా బస్సు కిటికీ అద్దాల్లో తలపెట్టి ఇరుక్కుపోయాడు.. తలను ఎలా విడిపించుకోవాలో తెలియన నానా అవస్థలు పడ్డాడు.. ఊహించని ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లోని సంత బొమ్మాళికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి టెక్కలి దగ్గర ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తలను బయటకు పెట్టాడు. సుమారు 15 నిమిషాల పాటు నానా అవస్థలు పడ్డాడు. గమనించిన డ్రైవర్ బస్సు ఆపి స్థానికులు, తోటి ప్రయాణికుల సాయంతో తలను ఎలాగోలా బయటకు తీశారు.
గతంలో ఇలాంటి ఘటన ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో జరిగింది. 20 యేళ్ల యువతి కిటికీ నుంచి వాంతులు చేసుకునేందుకు ప్రయత్నించి రెండు వాహనాల మధ్య తల నుజ్జు నుజ్జు కావడంతో మృతిచెందింది. సో.. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండటమే కాకుండా ఇలాంటి విషయాల్లో తోటి ప్రయాణికులను కూడా అప్రమత్తం చేయడం మంచిది.
టెక్కలిలో బస్సు కిటికీలో ఇరుక్కున్న ప్యాసింజర్ తల
— Aadhan Telugu (@AadhanTelugu) January 25, 2024
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇందిరా గాంధీ జంక్షన్ వద్ద బుధవారం ఓ వ్యక్తి తల బస్సు కిటికీలో ఇరుక్కుంది. సంతబొమ్మాలికి చెందిన సుందర్ రావు అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో వస్తూ ఫిక్స్డ్ కిటికీ డోర్ నుంచి తల బయటకు పెట్టాడు. సుమారు 15… pic.twitter.com/K4CuQXc4Yy