![ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచి.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం..](https://static.v6velugu.com/uploads/2025/02/man-physical-attack-on-btech-student-at-ntr-district-of-ap_Ne4RMtXKPF.jpg)
ఏపీలో దారుణం జరిగింది.. ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే యువకుడు బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణానికి పాల్పడ్డాడు హాస్టల్లో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచిన హుస్సేన్.. స్నేహితులు షేక్ గాలి సైదా, చింతల ప్రభుదాస్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్ ను ప్రశ్నించగా.. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించి, ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా.. షేక్ గాలి సైదా లోపలికి వెళ్లి.. హుస్సేన్ దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు
ALSO READ | భార్యపై అనుమానంతో ..భర్త ఆత్మహత్యా యత్నం
ఈ విషయాన్ని యువతి తల్లితండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.