Viral Video: ఆహారం కోసం వచ్చిన ఏనుగును రెచ్చగొట్టారు.. ఇంకేముంది.. విధ్వంసమే..

Viral Video: ఆహారం కోసం వచ్చిన ఏనుగును రెచ్చగొట్టారు.. ఇంకేముంది.. విధ్వంసమే..

ఏనుగు భారీ కాయంతో గంభీరంగా కనిపించినప్పటికీ ఒకరకంగా సాధు జంతువనే చెప్పాలి.. తనకు హాని కలిగించనంత వరకు ఎవ్వరి జోలికి వెళ్ళదు ఏనుగు. అలాంటి ఏనుగును రెచ్చగొడితే విధ్వంసం సృష్టించడం ఖాయమనే చెప్పాలి. ఇటీవల వెస్ట్ బెంగాల్ లో చోటు చేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా చెప్పచ్చు. ఆహారం కోసం అడవి నుండి పొలాల్లోకి వచ్చిన ఏనుగును స్థానికులు జేసీబీతో రెచ్చగొట్టగా ఏనుగు తిరగబడ్డ ఘటన వెస్ట్ బెంగాల్ లోని జగల్ పురిలో చోటు చేసుకుంది. ఇంటర్నెట్ లో ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది.

వెస్ట్ బెంగాల్ లోని జగల్ పూరిలోని దాంధీమ్ ఏరియాలో ఓ ఏనుగు ఆహారం కోసం అడవి నుండి పొలాల్లోకి వచ్చింది.. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు ఏనుగును జేసీబీతో రెచ్చగొట్టారు... ఈ క్రమంలో వాళ్ళ మీదకు తిరగబడ్డ ఏనుగు విధ్వంసం సృష్టించింది. పక్కనే ఉన్నవారిపై దాడి చేసి, ఆపై జేసీబీని సమీపంలోని వాచ్‌టవర్‌తో సహా నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేసింది ఏనుగు. ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

ALSO READ | Tech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు