లవర్ కోసం నడుస్తూ పాక్ బార్డర్ చేరిన యువకుడు

పాక్ లోని గర్ల్ ఫ్రెండును కలిసేందుకు కాలినడకన బార్డరుకు..
బీఎస్ఎఫ్ జవాన్లకు చిక్కిన మహారాష్ట్ర యువకుడు

న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని ప్రేమించి, ఆమెను కలిసేందుకు ఏకంగా పాకిస్తాన్ కు పయనమయ్యాడో మహారాష్ట్ట్ర యువకుడు.. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా, ఈ ప్రయాణానికోసం గూగుల్ మ్యాప్స్ను నమ్ముకుని బైక్ మీద బయల్దేరడంతోనే వచ్చింది చిక్కు. మధ్యలో బైక్ ట్రబుల్ ఇవ్వడంతో లెఫ్ట్ అండ్ రైట్ కొడుతూ బార్డర్కు దగ్గర్లో స్పృహ తప్పే స్థితిలో గురువారం బీఎస్ఎఫ్ జవాన్ల కంటపడ్డాడు. అప్పటికే ఆ యువకుడి కోసం అలర్ట్ రావడంతో జవాన్లు ఆ యువకుడిని ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు అప్పగించారు.

సినిమా స్టోరీని తలపించేలా..
మహారాష్ట్రలోని ఒస్మానాబాద్కు చెందిన సిద్దిఖి మొహమ్మద్ జిషాన్(20)కు కొంతకాలం క్రితం పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన యువతి సమన్రా ఫేస్బుక్లో పరిచయమైంది. రోజూ ఫేస్బుక్, వాట్సాప్ లో ఛాటింగ్ చేస్తూ జిషాన్ ఆమెను ప్రేమించాడు. ఆమెను కలవాలని నిర్ణయించుకుని గురువారం తన బైక్పై ప్రయాణమయ్యాడు. గూగుల్ మ్యాప్స్ సాయంతో మొదలెట్టిన పయనం.. గుజరాత్ దాకా వెళ్లేసరికి బైక్ ట్రబుల్ ఇవ్వడంతో బ్రేక్ పడింది. అయినా పట్టువదలకుండా కాలినడకనే ముందుకు సాగాడు. రాన్ ఆఫ్ కచ్ గుండా ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలన్నది జిషాన్ ప్లాన్.. తిండీతిప్పలు లేకపోవడంతో బార్డర్‌కు మరో 1.5 కి.మీ. దూరం ఉండగా డీహైడ్రేషన్ వల్ల పడిపోయాడు. స్పృహ తప్పే స్టేజ్లో ఉన్న జిషాన్కు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాథమిక చికిత్స చేసి, విచారిస్తే ఈ వివరాలన్నీ బయటపడ్డాయి. దీంతో వాళ్లు జిషాన్ను గుజరాత్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు, జిషాన్ కనిపించకపోవడంతో ఇంట్లో వాళ్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన మహారాష్ట్ర పోలీసులు గుజరాత్ పోలీసులకు సమాచారం అందించారు.

For More News..

కరెంటోళ్లు కూడా బిల్లులు కడతలే!

డెక్కన్‌‌ చార్జర్స్‌‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి