భర్తను ఛాయ్ తాగడానికి ఇంటికి పిలుస్తే రాలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ వడోదర జిల్లాలోని భాయ్లి ప్రాంతంలో 28ఏళ్ల మహిళ తన భర్త ఓ డాక్టర్. శుక్రవారం (ఫిబ్రవరి2)న సాయంత్రం డ్యూటీలో ఉన్న భర్తకు ఫోన్ చేసి టీ తాగడానికి ఇంటికి రావాలని కోరింది. పనిలో బిజీగా ఉన్నానని, ఇప్పుడు రాలేనని అతను భార్యతో అన్నాడు. దీంతో మనస్ధాపానికి గురైన ఆమె భర్తకు వీడియో కాల్ చేసి ఇంటికి రాకపోతే దుప్పటితో ఉరేసుకుంటానని చెప్పింది.
తన పనిలో బిజీగా ఉన్న భర్త ఇంటికి వెళ్లలేదు. తర్వాత ఇంటికి వెళ్లి చూడగా దుప్పటతో ఉరేసుకొని తన భార్య కనిపించింది. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె భర్త పోలీసులకు ఈ వివరాలు వెల్లడించాడు. వడోదర తాలూకా సబ్ ఇన్సెక్టర్ జేయూ గోహిల్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. కోలుకున్న తర్వాత మహిళను విచారింస్తామని చెప్పారు.