ChatGPT: అరుదైన వ్యాధి నుంచి యువకుడిని కాపాడిన చాట్ జీపీటీ..

ChatGPT: అరుదైన వ్యాధి నుంచి యువకుడిని కాపాడిన చాట్ జీపీటీ..

కృత్రిమ మేధ (Artificial Intellegence) ఎన్నో చిత్ర విచిత్రాలు చేస్తూ భవిష్యత్తును ఎన్నో కొత్త మలుపులు తిప్పుతోంది. ఇప్పుడు ఏ రంగంలోనైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న మార్పులు అన్నీ ఇన్నీ కావు. టెక్నాలజీ, ఇండస్ట్రియల్, సాఫ్ట్ వేర్, విద్య, వైద్యం... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఏఐ (Artificial Intellegence) అద్భుతాలు సృష్టిస్తోంది. తాజాగా ఒక యువకుడి ప్రాణాలను ఏఐ కాపాడింది అనే వార్త వైరల్ అయ్యింది. ఏఐ మనిషి ప్రాణాలు ఎలా కాపాడుతుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదెలాగంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఇటీవల ఒక యువకుడు ఏదో తెలియని అనారోగ్యం ఉన్నట్లు గమనించాడట. నిద్ర లేవగానే బస్ యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందో అంత దారుణంగా అతని ఆరోగ్యం క్షీణించిందట. రోజూ చేసే వ్యాయామాలే జిమ్ లో చేశానని, కానీ ఎందుకో రెండు రోజులుగా ఇబ్బంది ఉండటంతో ఏం చేయాలో తోచలేదని తన పరిస్థితిని చాట్ జీపీటీలో ఎంట్రీ చేశాడట. 

రెగ్యులర్ గా చేసే పుషప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ జిమ్ లో చేశానని, ఎందుకిలా అయ్యిందని చాట్ బోట్ ను అడిగాడట. చాలా ఘోరంగా రెండు రోజులుగా నా ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్ కు వెళ్దామనుకున్నాను. కానీ చాట్ బోట్ ను ఒకసారి అడుగుదాం అనుకొని నా కండిషన్ ను ఎంటర్ చేసి.. సొల్యుషన్ చెప్పని అడిగా. వెంటనే చాట్ జీపీటీ ‘‘మీకు రాబ్డోమయోలసిస్ వచ్చింది. అది సాధారణం నుంచి సీరియస్ స్థాయికి చేరుకుంది.  అర్జెంటుగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వండి’’ అని చెప్పిందట. 

రిస్క్ చేసేదెందుకు.. ఒకసారి చెకప్ చేయించుకుందామని ఆస్పత్రికి వెళితే డాక్టర్స్ కూడా అదే చెప్పారట. ‘‘  రాబ్డోమయోలసిస్ వలన మీ ఆరోగ్యం క్షీణించింది. ఇది కిడ్నీ(మూత్ర పిండాలు)లకు సంబంధించిన వ్యాధి. ఇది ముదిరితే కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోతుంది. కొన్ని సార్లు కిడ్నీ మూసుకుపోతుంది. బాడీలో ఏదైనా పార్ట్ లో కండరాళ్లు దెబ్బతింటే కణాలు పగిలి ప్రోటీన్ ను వదిలేస్తాయి. అవి కిడ్నీలకు వచ్చి ఫంక్షనింగ్ లో చాలా మార్పులు తీసుకువస్తాయి. కొన్ని సార్లు ప్రాణాలకే ప్రమాదం’’ అని డాక్టర్స్ చెప్పారట. 

చాట్ జీపీటీ చెప్పిందే నిజమయ్యిందని ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడట. అయితే టెస్టులు, ట్రీట్ మెంట్ చేశాక.. డాక్టర్స్ ఇచ్చే రిపోర్టు గురించి ముందే అర్థం అయ్యిందట అతనికి. ఎందుకంటే టెస్ట్ రిపోర్ట్ ఏముంటుందని అడిగితే ముందే చెప్పేసిందట చాట్ జీపీటీ. 

రాబ్డోమయోలసిస్ లక్షణాలేంటి:

రాబ్డోమయోలసిస్ వస్తే మజిల్స్ లో వాపు రావడం, మోషన్స్ సిరగ్గా రాకపోవడం, కాళ్లు చేతులు ఉబ్బడం, మూత్రం(యూరిన్) ఎర్రగా, నల్లగా, లేదంటే బ్రౌన్ కలర్ లో వస్తుందట. దీంతోపాటు నీరసంగా మారడం లాంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు వాంతులు, తలనొప్పి, కన్ఫూజన్ ఎక్కువగా ఉండటం, జ్వరం తదితర లక్షణాలు ఉంటాయి. 

యువకుడు తనకు చాట్ జీపీటీ చేసిన మేలును రెడ్డిట్ యాప్ లో షేర్ చేసుకున్నాడు. ఒక రకంగా తన ప్రాణాలు కాపాడిందని ఎమోషనల్ అయ్యాడు. మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే చాట్ జీపీటీని అడిగేరు. ఒకవేళ అడిగినా.. సమస్య ఉన్నా.. లేదని చెప్పినా.. డాక్టర్ ను కచ్చితంగా సంప్రదించండి. ఎందుకంటే.. సమస్యను గుర్తించేందుకు ఏఐ మనిషి కాదు కదా. అలాగే సరైన ఇన్ పుట్ ఇస్తే సరైన ఆన్సర్ ఇస్తుంది. తప్పుడు సమాచారం ఇస్తే తప్పుడు ఆన్సర్ ఇవ్వవచ్చు. దీనివలన.. ఒక సమస్యకు ఇంకో సొల్యూషన్ రావచ్చు. అందుకే ఎక్కువగా ఏఐ పైన డిపెండ్ కాకుండా డాక్టర్స్ ను సంప్రదించడం బెట్టర్.