
తనకు గర్ల్ ఫ్రెండ్ ను కనుగొనడంలో సహాయం చేయాలని కోరిన సోషల్ మీడియా వినియోగదారుడికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమత్కారమైన సమాధానం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శివం భరద్వాజ్‌అనే వ్యక్తి.. ఎక్స్ లో తన స్నేహితురాలిని కనుగొనడంలో సహాయం కోసం ఢిల్లీ పోలీసులను అభ్యర్థించారు. " ఇప్పుడు నేను సిగ్నల్. నాకు గర్లఫ్రెండ్ ఎప్పుడు దొరుకుంది. గర్ల్ ఫ్రెండ్ ను వెతికి పెట్టడంతో మీరు నాకు సహాయం చేయాలి." అని పోస్ట్ చేశాడు.
దీనికి ఢిల్లీ పోలీసులు తమదైన శైలీలో రిప్లే ఇచ్చారు. "సార్, ఆమెను కనుగొనడంలో మేము మీకు సహాయం చేస్తాము (ఆమె ఎప్పుడైనా కనిపించకుండా పోయినట్లయితే మాత్రమే). ఒకవేళ, మీరు 'సిగ్నల్' అయితే, మీరు ఎరుపు రంగులో కాకుండా ఆకుపచ్చగా ఉండాలని మేము కోరుకుంటాం" అని ఢిల్లీ పోలీసులు సమాధానం ఇచ్చారు.
పోలీసులు ఇచ్చిన హాస్యభరితమైన రిప్లే సోషల్ మీడియా నెటిజన్లను ఆకట్టుకోవడంతో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. పోలీసుల సమాధానికి ఫిదా అయిన నెటిజన్స్.. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఢిల్లీ పోలీసులు ప్రశంసలు పొందడం ఇదే మొదటిసారి కాదు. 2023లో, ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో భారత బౌలర్ మహమ్మద్ షమీ ప్రదర్శనకు సంబంధించి ఢిల్లీ, ముంబై పోలీసుల మధ్య జరిగిన చమత్కరమైన సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
న్యూజిలాండ్‌పై భారత్ విజయం తర్వాత, న్యూజిలాండ్ జట్టుపై 'ఘోరమైన దాడి' చేసినందుకు షమీపై ముంబై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీసులు సరదాగా ట్వీట్ చేశారు. దీనికి ముంబై పోలీసులు హాస్యాస్పదంగా ప్రతిస్పందించారు, 'అసంఖ్యాక హృదయాలను దొంగిలించడం' గురించి ఢిల్లీ పోలీసులు పర్యవేక్షణను ఎత్తిచూపారు.కొంతమంది 'సహ నిందితులను' జాబితా చేశారు, అయితే భారతీయ శిక్షాస్మృతి (IPC) పట్ల వారి అవగాహనను సూక్ష్మంగా ప్రదర్శించారు' అంటూ రిప్లే ఇచ్చారు. పోలీసులు మధ్య జరిగిన ఈ కన్వరేజేషన్ నెటిజన్లను ఆకట్టుకుంది.