- వరంగల్ మండి బజార్‌లోని షాపులో టాస్క్ ఫోర్స్తనిఖీలు
- రూ.8 లక్షల విలువైన 196 రకాల వస్తువులు స్వాధీనం
హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో కల్తీ ఫుడ్స్ అమ్ముతున్న బేకరీ షాపుపై టాస్క్‌ఫోర్స్‌పోలీసులు కొరడా ఝుళిపించారు. కొన్ని బ్రాండ్లకు చెందిన నకిలీ పదార్థాలతో పాటు గడువు ముగిసిన, కల్తీ చేసిన రూ.8 లక్షల విలువైన196 రకాల బేకరీ ఐటమ్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. టాస్క్‌ఫోర్స్‌పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ సిటీలోని బేకరీల్లో ఫుడ్ తయారీకి నకిలీ, కల్తీ ఐటమ్స్ వాడుతున్నారని ఫిర్యాదులు అందాయి.
గురువారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్లు, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మండిబజార్ఏరియాలోని సంతోష్కుమార్కిరాణ జనరల్ స్టోర్స్‌లో బేకరీ ఐటమ్స్ తయారీకి వాడే పైనాపిల్, యాపిల్, మ్యాంగో, వంటి ఫ్రూట్ క్రష్‌లు, పఫ్లపై వాడే చిల్లీ, టమోటా సాస్‌లు, స్పైసీ పౌడర్లు, ఫ్లేవర్లు గడువు పూర్తయిన, క్వాలిటీ లేని ప్రొడక్ట్స్‌గా గుర్తించారు. చాక్లెట్స్టిక్స్, ఇతర క్రీమ్స్క్వాలిటీగా లేవని నిర్ధారించారు.
వాటిని ఇతర జిల్లాలకు సప్లై చేసేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలుసుకుని సీజ్‌చేశారు. షాప్ఓనర్అంచూరి సంతోష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించారు. ఫుడ్‌సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించే వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్‌కిశోర్‌ఝా హెచ్చరించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను అమ్మితే ఫుడ్‌సేఫ్టీ – 2006, 2011 కింద యాక్షన్ తీసుకుంటామని స్పష్టంచేశారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐలు రవి కుమార్, రంజిత్‌కుమార్, ఎస్ఐ శరత్, ఇంతేజార్గంజ్ఎస్ఐ వెంకన్న, ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్కృష్ణమూర్తి, సిబ్బందిని సీపీ అభినందించారు.