![కుంభమేళా వ్యాపారం : టీ అమ్మితే.. రోజుకు 5 వేల లాభం.. 20 ఏళ్ల కుర్రోడి ఐడియా](https://static.v6velugu.com/uploads/2025/02/man-sells-tea-at-mahakumbh-earns-rs-5000-profit-in-just-1-day_4D8Q7jSKOH.jpg)
అతడో కుర్రోడు.. వయస్సు 20 ఏళ్లు మాత్రమే.. కంటెంట్ క్రియేటర్.. కుంభమేళాను ఆదాయ మార్గంగా చూశాడు. చేస్తున్న కంటెంట్ క్రియేటర్ కు బ్రేక్ ఇచ్చాడు.. కుంభమేళాలో ఛాయ్ దుకాణం పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు.. కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందు స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి రోజుకు 5 వేల రూపాయల లాభం తీసుకుంటున్నాడు.. కుంభమేళా ముగియగానే తన పని తాను చేసుకుంటానని.. కుంభమేళాలో బిజినెస్ ఐడియా.. 30 రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్.. ఓ చిన్న ఐడియా తనను లక్షాధికారిని చేసిందని.. కుంభమేళా ముగిసే సమయానికి.. ఓ 2 లక్షల రూపాయల లాభం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు ఈ 20 ఏళ్ల కుర్రోడు ప్రజాపత్.
మహాకుంభమేళా ప్రపంచలోని అతిపెద్ద కుంభమేళా. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇక్కడ చిన్నాచితకా వ్యాపారం చేసుకునే వాళ్లు కూడా లక్షాధికారి అవుతున్నారు. ఆ మధ్య వేప పుల్లలు అమ్ముకున్న పిల్లాడు కూడా లక్షాధికారి అయిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా మహాకుంభమేళాలో ప్రజాపత్ కుర్రాడి టీ దుకాణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ | యూపీఎస్ను నోటిఫై చేసినం.. సుప్రీం కోర్టుకు కేంద్రం వివరణ
కంటెంట్ క్రియేటర్ ప్రజాపత్ (20) అనే కుర్రాడు కుంభమేళాలో టెంపరరీగా చాయ్ దుకాణం పెట్టాడు. చాయ్ తో పాటు వాటర్ బాటిల్స్అమ్ముతున్నాడు. కప్పు టీ రూ. 10కి అమ్ముతున్నాడు. దీని ద్వారా ఒక్క రోజులోనే 5 వేల లాభం వచ్చిందని చెబుతున్నాడు. కుంభమేళాలో టీ షాప్ పెట్టా.. రోజు రూ. 7 వేల విలువైన టీ అమ్మిన..ఇందులో 5 వేల వరకు లాభం వచ్చిందని చెప్పాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కంటెంట్ క్రియేటర్ ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. ప్రజాపత్ సంపాదన నెలకు రూ. లక్షా 50 వేలు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రజాపత్ .. కుంభ చాయ్ వాలా అని కామెంట్ చేస్తున్నారు. చదువు మానేసి ఇలాంటి పనే చేసుకుంటానని మరో నెటిజన్ కామెంట్స్ చేశాడు. ఏది ఏమైనా ఇతను సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తారు. బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది త్రివేణి సంగమానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు చేశారు. బుధవారం ఒక్క రోజే సుమారు 2.50 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది