- తొండుపల్లిలో యువకుడి హల్చల్
శంషాబాద్, వెలుగు: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పోలీసులు వాహనం ఇవ్వలేదని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి టోల్గేట్వద్ద పోలీసులు మంగళవారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. నాగర్కర్నూల్ ప్రాంతానికి చెందిన చాపల శివ మద్యం సేవించి బైక్పై పట్టుబడ్డాడు. చెక్ చేయగా150% మద్యం సేవించినట్టు నిర్ధారణ అయ్యింది.
దీంతో కుటుంబసభ్యుల్లో ఎవరినైనా తీసుకొచ్చి వాహనం తీసుకెళ్లాలని యువకుడికి సూచించారు. వాహనం వదిలి 45 నిమిషాల తర్వాత వచ్చిన శివ.. బైక్ ఇవ్వాలని వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పటించుకున్నాడు. పోలీసులు వెంటనే మంటలు ఆర్పి, అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. మైలార్ దేవ్ పల్లి ఠాణాలో చాపల శివపై గతంలో సస్పెక్ట్ కేసు ఉందని, వాహనం కూడా అతని పేరుపై లేదని ట్రాఫిక్ సీఐ రాజు తెలిపారు.