వీడిని తండ్రి అంటారా: నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి.. తాను కూడా..

వీడిని తండ్రి అంటారా: నలుగురు పిల్లలను గొంతు కోసి చంపి.. తాను కూడా..

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది.. యూపీలోని షాజహాన్ పూర్ లో ఓ తండ్రి నలుగురు పిల్లలను కిరాతకంగా గొంతు కోసి చంపి.. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. షాజహాన్ పూర్ లోని మన్పుర్‌ చచారి గ్రామానికి చెందిన రాజీవ్ కుమార్‌ దంపతులకు నలుగురు పిల్లలు. 12,9,7, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. 

బుధవారం ( మార్చి 26 ) రాత్రి రాజీవ్ కత్తితో నలుగురు పిల్లల గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత వేరే గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజీవ్. గురువారం ఉదయం రాజీవ్ ఎంతసేపటికి తలుపు తీయకపోవడం గుర్తించిన తండ్రి అనుమానం వచ్చి.. మేడమీదకు వెళ్లి అక్కడినుంచి లోపలికి వెళ్ళగా రాజీవ్ అప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఏడాది క్రితం రాజీవ్ తలకు బలమైన గాయమైందని.. అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు తండ్రి. ఈ ఘోరం జరిగిన సమయంలో రాజీవ్ భార్య ఇంట్లో లేదని.. ఆ ముందురోజే పుట్టింటికి వెళ్లినట్లు తెలిపారు రాజీవ్ తండ్రి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్ వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.