లండన్: ఇంగ్లండ్‌కు చెందిన ఓ బిజినెస్‌మన్ సెక్స్‌వర్కర్‌తో చాటింగ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ తెలియొద్దని ఎప్పటికప్పుడు ఆ మెసేజ్‌లను డిలీట్ చేశాడు. అయినా, అవి భార్య కంటపడటంతో ఆమె విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. భరణం కింద రూ.53 కోట్లివ్వాలని పిటిషన్ వేసింది. దీనికంతటికీ కారణం యాపిల్ కంపెనీనే అంటూ ఆ భర్త కోర్టుకెక్కాడు. రూ.53 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ దావా వేశాడు.
అసలేం జరిగిందంటే..
యూకేలోని లండన్‌కు చెందిన బిజినెస్‌మన్ సెక్స్ వర్కర్‌తో చేసిన తన ఐఫోన్‌లోని చాటింగ్ అంతా డిలీట్ చేశాడు. అయితే, అదే ఐడీని తన ఇంట్లోని ఐ మ్యాక్లోనూ ఉపయోగించాడు. దీంతో ఐఫోన్లో డిలీట్ అయినప్పటికీ ఆ మెసేజ్‌లన్నీ ఐమ్యాక్‌లో ఉండిపోయాయి. ఎవరి కంట పడవనుకున్న మెసేజ్‌లను ఆయన భార్య చూసింది. దీంతో విడాకుల కోసం ఆమె కోర్టుకెక్కి ఈ మెసేజ్‌లను సాక్ష్యాలుగా చూపించింది.
రూ.53 కోట్లు భరణం చెల్లించాలని కోరింది. దీనికంతటికీ కారణం యాపిల్ కంపెనీ అంటూ భర్త కోర్టులో దావా వేశారు. తాను మెసేజ్‌లను తొలగించినప్పుడు డిలీటెడ్ అని కాకుండా ఈ ఒక్క డివైజ్‌లోనే డిలీట్ అయినట్లు మెసేజ్ వచ్చిఉంటే ఇంత జరిగేది కాదని పేర్కొన్నాడు. యూజర్‌కు సరైన సమాచారమివ్వని యాపిల్ కంపెనీదే తప్పని వాదించాడు. కంపెనీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడంతోనే ఇటు భార్యను, విడాకులు మంజూరైతే ఆస్తినీ కోల్పోవాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరు వేసిన పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది.