రియల్లీ గ్రేట్ కదా.. : పెట్రోల్ బంకు అమ్మాయి బొమ్మ గీసి ఇచ్చాడు..

మనం సాధారణంగా ఏదైనా షాప్ నకో, సూపర్ మార్కెట్ కో వెళ్లినప్పుడు డబ్బులిచ్చి మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటాం. ఇక పెట్రోల్ బంక్ కు వెళ్లినప్పడు పెట్రోల్ పోయించుకొని వెళ్లి పోతుంటాం. అదే మనకు షాపులకు కాని..పెట్రోల్ బంక్ సిబ్బంది,. యాజమాన్యానికి ఉన్న సంబంధం ...కాని ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ లో పనిచేసే మహిళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.  అది ఎలాగంటే...

ALSO READ:ఉస్మానియా ఆసుపత్రిలో పరిస్థితి దారుణం....కొత్త భవనం నిర్మించాల్సిందే

పెట్రోల్ బంక్ లో పనిచేసే ఓ మహిళా కార్మికురాలిని ఓ వ్యక్తి సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎండకు ఎండుతూ... వానకు తడుస్తూ విధినిర్వహణలో నిమగ్నమైంది.  ఓ వ్యక్తి పెట్రోల్ పోయించుకున్న తరువాత ఆ మహిళా కార్మికురాలికి శుభాకాంక్షలు తెలపాలని నిర్ణయించుకున్నాడు.  ఇక అంతే ఆమె ఫొటోను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి..దూరంగా వెళ్లి  ఆమె ఫొటోను పేపర్ పై డ్రాయింగ్ వేసి..ఆమె వద్దకు వెళ్లి ఇచ్చాడు. అప్పుడు ఆ ఆర్ట్ చూసిన ఆనందంలో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది.  ఆ తరువాత ఆమె నవ్వుతూ..ఆ వ్యక్తిని ప్రశంసించింది. అంతే కాదు ఈ మధురమైన ఘటననను అక్కడున్న వ్యక్తులు వీడియో తీసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో వైరల్ గా మారింది.  ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల లైక్‌లు,  పదకొండు మిలియన్ల మందికి  పైగా ఈ వీడియోను చూశారు. 
ఆ వ్యక్తిని ధర్మేష్ హదియాగా గుర్తించి.. ఆ కళాకారుడిని సోషల్ మీడియాలో ప్రజలు అభినందించారు. అద్భుతమైన కంటెంట్ కు సమాధానంగా ఇది నారోజుగా మారిందని ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు తెలిపారు. 

https://www.instagram.com/reel/Ct3Q9qpginx/?utm_source=ig_embed&ig_rid=4210b0a2-7f90-44fe-99de-6c92ee870d38