ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు, ఈజీ మనీకి అలవాటు పడ్డ కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు.దొంగతనం చేయటం వల్ల తర్వాత ఎదురయ్యే పర్యవసానాల గురించి కూడా ఆలోచించకుండా చోరీలు చేసి చిక్కుల్లో పడుతుంటారు.అమ్మవారి మేడలో మంగళసూత్రం అపహరించిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి అస్సలు భయం,భక్తి లేకుండా అటూ ఇటూ చూసి అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించి జేబులో వేసుకుని అక్కడినుంచి జారుకున్నాడు. ఏ మాత్రం భయం కూడా లేకుండా అమ్మవారి మేడలో మంగళసూత్రాన్ని దొంగలించటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.