మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్.. రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఒక సామాజికవర్గ సభ్యులతో సమావేశమైన సమయంలో ఓ వ్యక్తి అతనిపై పసుపు పొడిని చల్లారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో ధన్‌గర్ (గొర్రెల కాపరి) కమ్యూనిటీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మంత్రికి ఇరువైపులా నిలబడి ఉన్నారు. వారు ఇచ్చిన లేఖను మంత్రి చదువుతుండగా, వారిలో ఒకరు అకస్మాత్తుగా అతని జేబులో నుండి పసుపు పొడిని తీసి అతని తలపై పోశారు. వెంటనే అప్రమత్తమైన పాటిల్ సహాయకులు ఆ వ్యక్తిని పట్టుకుని, నేలపైకి విసిరి, అతన్ని తన్నడం, కొట్టడం ఈ వీడియోలో రికార్డయింది. ఇది షోలాపూర్ జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంతి గృహంలో చోటుచేసుకుంది.
తన కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని శేఖర్ బంగాలే అనే వ్యక్తి మీడియాతో చెప్పాడు. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీ కింద ధన్‌గర్ కమ్యూనిటీ డిమాండ్‌ను పునరుద్ఘాటించిన ఆయన, డిమాండ్‌ను త్వరగా నెరవేర్చకపోతే ముఖ్యమంత్రిపై, ఇతర రాష్ట్ర మంత్రులపై కూడా నల్ల రంగు వేస్తామని హెచ్చరించారు.
ALSO READ :హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. పరికి చెరువులోకి నురగ
పసుపు పొడిని మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారని, దాన్ని పవిత్రంగా పరిగణిస్తారని, తప్పుగా భావించడం లేదని రాధాకృష్ణ విఖే పాటిల్ అన్నారు. ఇది సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని తాను కోరలేదని తెలిపారు. తన పార్టీ కార్యకర్తలు తనను ఎందుకు కొట్టారని, ఏం జరిగిందో ఆ క్షణంలో ఎవరికీ అర్థం కాలేదని, అందుకే ఇది సహజమైన ప్రతిచర్య అని పాటిల్ అన్నారు. ఆ వ్యక్తి వెంట వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరినట్లు కూడా ఆయన చెప్పారు.