పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్ పేటలో బొజ్జం శివకృష్ణ బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్అటెంప్ట్ చేసి సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. అందులో తన భూమికి సంబంధించి పంచా యితీ నడుస్తోందని, ఊరికి చెందిన కొందరు లీడర్లు, పెద్ద మనుషులు డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించాడు. పలువురి పేర్లు కూడా వెల్లడించాడు. దీంతో కుటుంబసభ్యులు అతడిని పెద్దపల్లి దవాఖానకు తరలించారు.
పోలీసుల వివరణ కోరగా ఇంతకుముందు అన్నదమ్ముల మధ్య ఒకసారి భూమికి సంబంధించిన గొడవ జరిగిందని, పెద్ద మనుషులతో ఒప్పందం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, సివిల్‌కేసు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.