అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటు యత్నం

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం కారులో వచ్చిన ఓ వ్యక్తి భద్రతను ఉల్లంఘించి దోవల్ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల అదుపులో ఉన్న ఆగంతకున్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

పోలీసుల విచారణలో దుండగుడు గుర్తు తెలియని వ్యక్తులు తన శరీరంలో చిప్ అమర్చి తనను కంట్రోల్ చేస్తున్నారని చెప్పినట్లు సమాచారం.  అయితే సదరు వ్యక్తికి ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించగా చిప్ లేదని తేలినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు సదరు వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కిరాయికి తీసుకున్న కారులో వచ్చి అజిత్ దోవల్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి స్పెషల్ సెల్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఆయన పాటల వల్లే నా సినిమాలకు ప్రజాదరణ

ఈ నెల 20న మహారాష్ట్రకు సీఎం కేసీఆర్