
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో దారుణం జరిగింది. బంగారం కోసం నారాయణమ్మ అనే ఓ వృద్ధురాలిపై స్థానిక కేబుల్ ఆపరేటర్ గోవింద్ హత్యాయత్నం చేశాడు. ఆమె ఇంట్లో ఉండగా వెనుక నుంచి వచ్చి గొంతు బిగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నారాయణమ్మ మెడలోని 8 తులాల బంగారంతో పరారయ్యాడు గోవింద్. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయయ్యాయి. ఈ ఘటన 2024 జనవరి 26 రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జరిగింది. నారాయణమ్మను బంధువులు ఆసుపత్రికి తరలించారు.
#VizagHorror #DisturbingVideo #Vizag: Thief tries to strangle elderly woman to death using a towel while she was alone at home, flees with her 8 tola chain in Vishakhapatnam, AP on Monday.
— Saba Khan (@ItsKhan_Saba) January 29, 2024
The woman identified as Laxmi Narayanamma survied the attack and is said to be out of… pic.twitter.com/QXWoE3w7I6
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరచూ ఇంటికి వచ్చే కేబుల్ ఆపరేటర్ గోవింద్.. 67 ఏళ్ల లక్ష్మీ నారాయణమ్మ బంగారు గొలుసును దొంగిలించాలని భావించాడు. ఈ క్రమంలో జనవరి 26వ తేదీన ఆమె ఒంటరిగా ఉండటంతో ఆమెపై దాడికి యత్నించాడు. ఆమె చనిపోయిందనుకుని ఇంటి నుంచి బంగారంతో పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా IPC సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 394 (దోపిడీకి పాల్పడటం) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.