రూ.300 కోట్ల మోసం చేసి.. వేషం మార్చాడు : చివరికి

రూ.300 కోట్ల మోసం చేసి.. వేషం మార్చాడు : చివరికి

అమాయకపు ప్రజలకు మాయమాటలు చెప్పి దాదాపు రూ.300 కోట్ల వరకు ఫ్రాడ్ చేసిన వ్యక్తి వేషం మార్చి పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో అతనిపై ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. పోలీసుల అతని కోసం వెతుకుతున్నారు. బాబాన్ విశ్వనాథ్ షిండే మహారాష్ట్రలో 2000 మందికి అధిక వడ్డీ ఇప్పిస్తా అని.. డిపాజిట్లు సేకరించి మోసం చేసి రూ.300 కోట్లు కొట్టేశాడు. ఇప్పుడు అతను మోస్ట్ వాంటెండ్ క్రిమినల్. సన్యాసి వేషంలో అస్సాం, నేపాల్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని ప్రాంతాల్లో తిరుగుతున్నాడని పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బృందావన్, బీడ్ జిల్లా పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు.

మథురలో అతన్ని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ టీం అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సన్యాసి వేషంలో విశ్వనాథ్ షిండే తిరుగుతున్నాడు. బృందావన్‌లోని కృష్ణ బలరామ్ ఆలయం సమీపంలో బాబాన్ విశ్వనాథ్ షిండేను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. మథురలోని పోలీసు అధికారుల ప్రకారం, దాదాపు రూ. 300 కోట్ల మోసానికి సంబంధించిన పలు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి షిండేను అరెస్ట్ చేశారు. 

ALSO READ | బీహార్​లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి

షిండే ఢిల్లీ, అస్సాం, నేపాల్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వేషం మార్చి సన్యాసిగా నటిస్తూ పట్టుబడకుండా తప్పించుకుంటున్నాడని డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ సింగ్ చెప్పారు. మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేయగా, మరుసటి రోజు షిండేను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం మథుర కోర్టు నుండి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత అతనిని అదుపులోకి తీసుకుందని అధికారులు తెలిపారు.