వరంగల్, వెలుగు: డబ్బులు సంపాదించాలని ఓ వ్యక్తి ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతూ దొరికిపోయాడు. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఇన్ స్పెక్టర్ సురేశ్తెలిపిన ప్రకారం.. గ్రేటర్ వరంగల్ లోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధి శాయంపేటలో ఉండే అట్ల వెంకటనర్సయ్య వ్యవసాయ కూలీ.
ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచాడు. వాటిని కట్ చేసి ఎండబెట్టి అమ్మేందుకు సిద్ధమయ్యాడు. సమాచారం అందడంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ వెళ్లి దాడి చేసి నిందితుడు వెంకట నర్సయ్యను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. ఆర్‍ఐ శివకేశవులు, ఆర్‍ఎస్‍ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజు సిబ్బంది ఉన్నారు.