ములుగులో మావోయిస్టు మందుపాతర పేలుడు..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.  వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. సోమవారం (జూన్ 3) ఉదయం ముగ్గురు వ్యక్తులు కట్టెల కోసం అడవికి వెళ్ళారు. అయితే పోలీసులను హతమార్చడంకోసం మావోయిస్టులు పెట్టిన మందుపాతర పేలి జగన్నాథపురం గ్రామానికి ఏసు చనిపోయాడు. ఇదే గ్రామానికి చెందిన రమేశ్, ఫకీర్ గాయపడ్డారు. మరోవైపు అడవుల్లో మందుపాతర పేలడంతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇంకా అడవుల్లో ఎన్ని బాంబులు ఉన్నాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.