పిల్లిని కాపాడబోయి వ్యక్తి మృతి

పిల్లిని కాపాడబోయి వ్యక్తి మృతి
  • వరంగల్ జిల్లా నెక్కొండలో ఘటన

నెక్కొండ, వెలుగు : బావిలో పడిన పిల్లిని కాపాడబోయి ఓ వ్యక్తి చనిపోయిన  ఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ టౌన్ లో  శుక్రవారం జరిగింది. ఎస్ఐ  మహేందర్‌ తెలిపిన ప్రకారం... నెక్కొండ టౌన్ కు చెందిన  కక్కెర్ల యాదగిరి (59) గీత కార్మికుడు.  అదే గ్రామంలో తన చిన్నకూతురు ఉండే ఇంటి వద్ద  బావిలో ఓ పిల్లి పడిపోయింది.

దాన్ని  చూసిన యాదగిరి  బయటకు తీసేందుకు.. తన నడుముకు తాడు కట్టుకొని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాడు జారడంతో అతడు నీటిలో పడిపోయాడు.  స్థానికులు యాదగిరిని బయటకు తీయగా అప్పటికే చనిపోయాడు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.