ఇంటి ముందు ఆడుకుంటున్న పాపపై.. కామాంధుడి అఘాయిత్యం.. కొన్ని గంటల్లోనే నిందితుడి ఎన్ కౌంటర్

ఇంటి ముందు ఆడుకుంటున్న పాపపై.. కామాంధుడి అఘాయిత్యం.. కొన్ని గంటల్లోనే నిందితుడి ఎన్ కౌంటర్

కర్ణాటకలో ఐదేళ్ల పాపను కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపిన ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఆదివారం (ఏప్రిల్ 12) ఉదయం హుబ్బాలి ప్రాంతంలో పాపను చంపేసినట్లు తెలిసిన క్షణం నుంచి రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని స్థానికులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఈ కేసులో నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు.. చివరికి ఎన్ కౌంటర్ చేయడం సంచలనంగా మారింది. 

పాపను మర్డర్ చేసిన వ్యక్తి బీహార్ కు చెందిన నితేశ్ కుమార్ (35) గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులపైకి దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణలో పోలీసులు నిందితుడిని ఎన్ కౌంటర్ చేసినట్లు చెప్పారు. నిందితుడిపై మర్డర్ కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదైంది. ‘‘నితేశ్ కుమార్ ను పోలీస్ టీమ్ అదుపులోకి తీసుకుని అతడి వివరాలను సేకరిస్తున్న తరుణంలో పోలీసులపై తిరగబడ్డాడు. 

Also Read : ఇంటి ముందు ఆడుకుంటున్న పాపపై.. కామాంధుడి అఘాయిత్యం

‘‘ఆ సమయంలో పోలీస్ వెహికిల్ ను కూడా డ్యామేజ్ చేశాడు. ఆ టైమ్ లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిపైకి రెండు రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు’’ అని హుబ్బాలి పోలీస్ చీఫ్ శశి కుమార్ తెలిపారు. 

ఆదివారం ఉదయం నితేశ్ కుమార్ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపడంతో హుబ్బాలి లోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. కుటుబానికి న్యాయం చేయాల్సిందిగా, నిందితుడిని శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున్న ధర్నాకు దిగారు. 

ఆ చిన్నారి తండ్రి పెయింటర్. తల్లి వేరే ఇళ్లల్లో పనిచేస్తూ.. బ్యూటీ పార్లర్ లో సహాయకురాలిగా పనిచేస్తుంటుంది. పనికి వెళ్లినప్పుడు కూతురుని వెంట తీసుకెళ్లింది. ఆ సమయంలో పాప ఆడుకుంటుండగా కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లిన తల్లి ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికింది. ఆ కన్న తల్లి రోదనలు విని స్థానికులు కూడా ఆ పాప కోసం వెతుకులాట సాగించారు.

అలా వెతుకుతుండగా.. ఆ ఇంటి సమీపంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గర నిరుపయోగంగా ఉన్న బాత్ రూమ్ లో చిన్నారి విగత జీవిగా పడి ఉండటం చూశారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే పాప చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి పట్టుకున్న పోలీసులు.. అనూహ్య పరిస్థితులలో కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.