అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడు అదృశ్యం..ఐదు రోజుల తర్వాత బావిలో శవమై..

అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడు అదృశ్యం..ఐదు రోజుల తర్వాత బావిలో శవమై..

అత్తింటికి వచ్చిన అల్లుడు బావిలో శవమై తేలిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కథళాపురం మండలం పోసానిపేటలో ఐదు రోజుల క్రితం కనిపించ కుండా పోయిన వ్యక్తి ఉరి చివరన ఉన్న వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. చాలారోజుల తర్వాత భార్యపిల్లలతో అత్తింటికి వచ్చిన అల్లుడు శవమై కనిపించ డంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు వచ్చిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన జక్కుల సాయికుమార్(30) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. గత కొంతకాలంగా దుబాయ్ లో ఉంటున్న సాయికుమార్ మామ సొంత గ్రామానికి రావడంతో.. సాయికుమార్ భార్యపిల్లలతో అత్తగారి ఊరి అయిన పోసానిపేటకు వచ్చాడు. ఈ క్రమంలో ఐదు రోజులు క్రితం కనిపించకుండాపోయాడు. గురువారం (ఫిబ్రవరి 13)న పోసానిపేట శివారులోని వ్యవసాయ బావిలో శవమై తేలాడు. 

గత కొన్నేళ్లుగా అత్తింటివారికి, సాయికుమార్ కు మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.. అత్తింటివారే సాయికుమార్ ను చంపి బావిలో పడేసి ఉంటారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.