బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి 400 కిలోమీటర్లు వెళ్లిండు

బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడానికి 400 కిలోమీటర్లు వెళ్లిండు
  • రేర్‌‌‌‌‌‌‌‌ బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ రక్తాన్ని ఇచ్చి ఓ తల్లి ప్రాణాలను నిలబెట్టిన మహారాష్ట్ర వ్యక్తి 

ఇండోర్‌ ‌‌‌‌‌‌‌:  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి మహిళ ప్రాణాలు కాపాడాడో వ్యక్తి. రేర్ బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కలిగిన వ్యక్తి తన రక్తాన్ని ఇచ్చి ఆమెకు ప్రాణం పోశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌లో మే 25న జరిగింది. రవీంద్ర అష్టేకర్‌‌‌‌‌‌‌‌ మహారాష్ట్రలోని షిర్డీలో హోల్‌‌‌‌సేల్‌‌‌‌ పూల వ్యాపారం చేస్తున్నాడు. అర్జెంట్‌‌‌‌గా ఓ మహిళకు బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ కావాలని సోషల్‌‌‌‌ మీడియాలో న్యూస్ చూశాడు. ఆ వెంటనే రవీంద్ర తన ఫ్రెండ్‌‌‌‌ కారు తీసుకొని మహారాష్ట్ర నుంచి 440 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. అక్కడ ఆ మహిళకు నాలుగు యూనిట్ల బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ రక్తం ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడాడు.

 అనంతరం రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. తానేమీ గొప్ప పని చేయలేదని, తన వంతు సాయంగా రక్తాన్ని ఇచ్చి ఆ మహిళ ప్రాణాలు కాపాడుతున్నానని చెప్పాడు. గత పదేండ్లలో మహారాష్ట్రతో పాటు గుజరాత్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌లోని వివిధ నగరాల్లో 8 సార్లు బ్లడ్‌‌‌‌ డొనేట్‌‌‌‌ చేశానని తెలిపాడు. కాగా, డెలివరీ తర్వాత ఓ మహిళ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబసభ్యులు ఆమెను దగ్గర్లో హాస్పిటల్‌‌‌‌లో జాయిన్‌‌‌‌ చేశారు. అయితే, ఆ మహిళకు ఆపరేషన్‌‌‌‌ చేసే సమయంలో ‘ఓ’పాజిటివ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ బ్లడ్‌‌‌‌ను ఎక్కించారు. దీంతో మహిళ పరిస్థితి సీరియస్‌‌‌‌గా మారింది.  అర్జెంట్‌‌‌‌గా బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ రక్తం ఎక్కించాలని లేకపోతే ఆమె బతకదని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఈ విషయాన్ని సోషల్‌‌‌‌ మీడియాలో పెట్టారు. ఈ మెసేజ్‌‌‌‌ చూసిన రవీంద్ర వెంటనే ఇండోర్‌‌‌‌‌‌‌‌కు చేరుకొని, బాంబే బ్లడ్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఇచ్చాడు.